24 August, 2026 | 7:23 PM

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: ఎంపీడీవో దివ్యదర్శన్ రావ్

24-08-2026 06:04 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజ సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దివ్య దర్శన్ రావు, తాసిల్దార్ బషీరుద్దీన్ లు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని 27 ప్రభుత్వ కార్యాలయలకు సంబంధించిన అధికారులు సమావేశానికి హాజరై ప్రజల నుండి వివిధ రూపాలలో వచ్చిన 2 దరఖాస్తులను స్వీకరించారు.

అనంతరం తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, మున్సిపల్ కమిషనర్ టి, రమేష్ లు మాట్లాడుతూ ప్రజలకు సులువుగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండలాలలో దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా మండల ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. సుల్తానాబాద్ మున్సిపల్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అందించి సంబంధిత అధికారులతో పరిష్కారం పొందవచ్చునని వివరించారు.