24 August, 2026 | 7:26 PM

రాష్ట్రఉపాధ్యక్షులుగా అమరవేణి నర్సాగౌడ్ నియామకం

24-08-2026 06:13 PM

నిర్మల్ ,ఆగస్టు 24 ( విజయ క్రాంతి): హైదరాబాద్ లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అమరవేణి నర్సాగౌడ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అమరవేణి నర్సాగౌడ్ గత 30 సంవత్సరాలుగా విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలు పెట్టి, మాములు సభ్యుడి నుండి జాతీయ అధ్యక్షులుగా ఎదిగి తెలంగాణ సాధన ఉద్యమంలో ఎన్నో నిర్భందాలను ఎదుర్కొని ఉద్యమ నేతగా ఎదిగాడన్నారు. అసంఘటిత కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలలో పనిచేసిన అమరవేణి నర్సాగౌడ్ బీసీ కులాలను ఐక్యం చేస్తున్నందున.. ఆయనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధక్షులుగా నియమించారని తెలిపారు. నియామక పత్రాన్ని ఆయన చేసుతల మీదుగా అమరవేణి నర్సాగౌడ్ కి అందించారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మోకుదెబ్బ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్ గార్లు పాల్గొన్నారు.