స్టీల్ ప్లేట్ల వితరణ
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని రాధాస్వామి సత్సంగంలో గంగిశెట్టి మధురమ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరసంగం చైర్మన్ మురికి రవీందర్ కి శనివారం స్టీల్ ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మధురమ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ... ప్రతి శనివారం, ఆదివారాల్లో హైదరాబాద్ వాసవిలు శంకర్లాల్ ముకుంద లాల్ చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం అభినందనీయమని తెలిపారు.
సరసంగం చైర్మన్ రవీందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సత్సంగంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్న శంకర్ లాల్, ముకుంద లాల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మధుర అమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసినందుకు గంగిశెట్టి జగదీశ్వర్ కి కృతజ్ఞతలుతెలిపారు. ఈ కార్యక్రమంలో కోయల్ కార్ దుర్గాజి,, నాగరాజ్, రమేష్,చింత అనిల్,తాళ్లపల్లి రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




