26 June, 2026 | 10:54 PM

చేగుంటలో ఘనంగా మొహరం ఉత్సవాలు

26-06-2026 09:35 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పట్టణ కేంద్రం లో మొహరం ఉత్సాహాలు ఘనంగా నిర్వహించారు, ఉత్సవాలకు చేగుంట పట్టణ సర్పంచ్ సండ్రగు స్రవంతి సతీష్,  ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ, పాలకవర్గం సభ్యులతొ కలిసి మొహరం ఉత్సవాలు  పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మొహరం ఇస్లామీయ క్యాలెండర్‌లో తొలి నెలగా ముస్లింలు భావిస్తారని. ఈ నెలలో కర్బలా యుద్ధంలో వీరమరణం పొందిన ఇమామ్ హసేన్, ఇమామ్ హుస్సేన్, ఆయన అనుచరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మొహరం ఆచరిస్తారని, సత్యం, ధర్మం, న్యాయం కోసం చేసిన త్యాగానికి ప్రతీకగా మొహరం నిలిచింది.

కాబ్బటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకలు "పీర్ల పండుగ"గా ప్రసిద్ధి చెందాయని . మతాలకు అతీతంగా  ప్రజలు పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. గ్రామ ప్రజలు, భక్తిశ్రద్ధలతో మొహరం ఉత్సవాలను నిర్వహిస్తూ గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారు. పూర్వీకులు ప్రారంభించిన ఈ ఆచారాన్ని నేటి యువత కూడా అదే ఉత్సాహంతో కొనసాగించడం విశేషం. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి మొహరం పీర్లను సంప్రదాయబద్ధంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, ప్రత్యేక ప్రార్థనలు, భక్తి కార్యక్రమాల మధ్య గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించుకుని పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.