17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్ పంపిణీ

17-02-2026 03:53 PM

మోతే,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం ప్రాథమిక పాఠశాలలో, నామవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో పదవతరగతిచదువుతున్న రాఘవాపురం గామ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ బుక్స్ ను,  రాఘవాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ ను సిపిఎం రాఘవాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కీలు కానీ సోమయ్య, సోమమ్మ జ్ఞాపకార్థం గత 12 సంవత్సరాలుగా వారి కుమారుడు కీలు కానీ సోమయ్య, సోమమ్మ ఫౌండేషన్ చైర్మన్ కీలు కానీ లక్ష్మణ్ సహకారంతో విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్  అందజేశామన్నారు.

సిరికొండ గ్రామంలోనిరుపేద కుటుంబంలో పుట్టిన కీలు కానీ లక్ష్మణ్ చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు పడి పై చదువులు చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక చదువును మధ్యలో ఆపివేసి హైదరాబాదుకు వలస వెళ్లి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి అనేక కష్టాలను ఎదుర్కొని వ్యాపార పరంగా అభివృద్ధి అయ్యాడని అన్నారు. తనలాగా విద్యార్థులు ఇబ్బందులు పడవద్దని చదువుకు దూరం కావద్దని ఉద్దేశంతో గత 12 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ వంటివి అందించడం అభినందనీయమన్నారు.  

మాడూరి దీక్షతకు సన్మానం

ఇటీవల జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో విజయం సాధించినమాడూరి దీక్షతను  సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. సిపిఎం మండల కమిటీ సభ్యులు, రాఘవపురం మూడవ వార్డు సభ్యులు కిన్నెర పోతయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయురాలు మౌనిక విద్యార్థులు పాల్గొన్నారు.