అంకుసాపూర్ పాఠశాలలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేసి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ జగ్గాని రాజేశం, ప్రధానోపాధ్యాయులు రాజు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యుడు బాలయ్య, విలేజ్ సెక్రటరీ సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.






