19 June, 2026 | 10:25 PM

నీటి నిలువ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

19-06-2026 08:34 PM

కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న మాన్సూన్ ప్రిపేర్డ్‌నెస్ కార్యక్రమాలలో భాగంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో నీరు నిల్వ అయ్యే ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సంబంధిత అధికారులకు రానున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, ఇంజినీరింగ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది,సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.