29 August, 2026 | 12:40 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన ఆర్మూర్ లయన్స్ గ్రీన్ ప్రతినిధులు

19-06-2026 08:46 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో ఆర్మూర్ లయన్స్ గ్రీన్ చార్టర్ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా అమృత్ సర్ లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్ హర్దీప్ కర్కా వారికి స్వాగతం పలికారు. వారి డిస్టిక్ కి సంబంధించిన లయన్ పిన్ తో గౌరవించి శుభాకాంక్షలు తెలియజేయడం  జరిగిందని నివేదన్ గుజరాతీ తెలిపినారు. అనంతరం వారు అమృత్ సర్ లో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి గవర్నర్ వివరించడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు విస్తరించబడటం అభినందనీయమని వారు కొనియాడారు. అందులో భాగంగా తెలంగాణలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధులు కలవడం ఆనందదాయకమని నివేదన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో అర్మూర్ ప్రతినిధులు సంతాని విజయ్, నర్సా గౌడ్, అల్జాపూర్  అనిల్, ఒమాన్ శ్రీధర్, డాక్టర్ రజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల శ్రీనివాస్ గౌడ్, బొచ్కర్ నందకిషోర్ తదితరులు పాల్గోన్నట్లు వివరించారు.