19 June, 2026 | 10:26 PM

కడతేరనున్న 'అంతిమ' కష్టాలు

19-06-2026 08:20 PM

ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైకుంఠధామ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనికి ఆనుకొని ఉన్న స్మశాన వాటికలో ఉన్న దుస్థితులపై  పత్రిక లలో ప్రచురించిన కథనాలకు ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి  స్పందించారు.  కనీస సౌకర్యాలు కూడా లేని స్మశాన వాటిక పరిస్థితిని తెలుసుకొని చలించిపోయాడు. వెంటనే స్పందించిన సుభాష్ రెడ్డి  ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నారు.

దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం అదనపు కలెక్టర్ కు లేఖ రాశారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైకుంఠధామ అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతు అనుమతులు జారీ చేసింది. దీనికి సంబంధించిన అనుమతి పత్రాన్ని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులకు శుక్రవారం అందజేశారు.