calender_icon.png 4 February, 2026 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ది మాంద్యం పిల్లల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

04-02-2026 06:34:26 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): బుద్ది మాంద్యం పిల్లల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాలలో విస్తృతంగా పర్యటించారు. సుల్తానాబాద్ పట్టణంలో బుద్ధి మాంద్యం పిల్లలకు ఏర్పాటు చేసిన  పాఠశాల, చిల్డ్రన్ హోమ్, వృద్ధాశ్రమం, ఔషధ గోడౌన్, పెద్దపల్లి పట్టణంలోని చిల్డ్రన్ హోమ్ ను కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, బుద్ధి మంద్యం పిల్లలకు ఏర్పాటుచేసిన పాఠశాలలో వారి అభివృద్ధి చెందుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.  పిల్లలకు అవసరమైన ఫిజియోథెరపీ సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ సేవలను పూర్తి స్థాయిలో వాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎదుగుదల సరిగ్గా లేని పిల్లలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. 

వృద్ధాశ్రమంకు సరఫరా చేసిన వస్తువులను తనిఖీ చేసి త్వరగా వృద్ధాశ్రమం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులు నెల రోజులలో పూర్తి కాని పక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం గట్టేపల్లి లోని ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషద గోడౌన్ లో మెడిసిన్ స్టాక్ కట్టుదిట్టంగా మెయింటైన్ చేయాలని అన్నారు.పెద్దపల్లి చిల్డ్రన్ హోమ్ లో కలెక్టర్ పిల్లలతో ముచ్చటించి వారికి అందుతున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్,  ఎంపీడీవో దివ్య దర్శన్ రావు ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.