calender_icon.png 1 November, 2024 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్ అమలు నుంచి రూ.14.63 కోట్ల పట్టివేత

22-04-2024 01:49:52 AM

జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి రూ.14.63 కోట్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్ని కల అధికారి రొనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా శనివారం నుంచి ఆదివారం వరకు రూ.5,88,400 నగదు, ఇతర పోలీస్ అథారిటీల ద్వారా రూ.1,62,68,891 విలువ గల ఇతర వస్తువులు, 48 లీటర్ల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.

మొత్తం 13 ఫిర్యాదులు అందగా వాటిని పరిశీలించి, పరిష్కరించి 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.14,63,78,205 నగదు, రూ.6,90,90,818 విలువైన వస్తువులు, 20 వేల 920 లీటర్ల మద్యం పట్టుకుని 208 కేసులను నమోదు చేసి 206 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 2,920 లైసెన్స్ కలిగిన ఆయుధాలు డిపాజిట్ అయినట్లు ప్రకటించారు.