4 April, 2026 | 7:27 PM

తెలంగాణ క్రీడ పాఠశాలలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

04-04-2026 06:00 PM

మేడ్చల్ జిల్లా సెక్రటరీ స్టాన్లీ జోన్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ క్రీడా పాఠశాల హకీంపేటలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని మేడ్చల్ జిల్లా సెక్రటరీ స్టాన్లీ జోన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 20 విభాగంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు 26/4/2006 నుండి 27/ 4/ 2010 మధ్య పుట్టిన వారై ఉండాలన్నారు. విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 6న ఉదయం 8 గంటలకు తెలంగాణ క్రీడా పాఠశాలలో 9849612733 లేదా 9000095217 నెంబర్లకు రిపోర్ట్ చేయగలరని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అట్లాటిక్స్ పోటీలలో మేడ్చల్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.