30 June, 2026 | 11:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు ప్రారంభం

08-09-2024 07:51 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో అండర్-11 బాల బాలికల జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అసోసియేషన్ కన్వీనర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, పోటీల ఆర్గనైజర్ ఎన్.స్వామి తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చెస్ క్రీడ దోహదం చేస్తుందన్నారు. మైండ్ గేమ్ చెస్ ను ప్రతి ఒక్కరు చిన్నప్పటినుండే సాధన చేయాలన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తి చాటి  చక్కటి ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు  ఎంపిక కావాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విట్టల్ రెడ్డి, నాందేవ్, జయశ్రీ, రాము, వినోద్,  కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.