క్రీడల్లో బాలికల ప్రతిభను ప్రోత్సహించడం మనందరి బాధ్యత
రాగన్నగూడలో అండర్–17 బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
ఆదిభట్ల,(విజయక్రాంతి): క్రీడల్లో బాలికల ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ అన్నారు. రాగన్నగూడలో షైన్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆమె పాల్గొని క్రీడాకారిణులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ.. బాలికలు క్రీడల్లో రాణించడం ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలికలకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మన ఆడబిడ్డలు గెలవాలి.. ఎదగాలి.. దేశానికి గర్వకారణంగా నిలవాలి” అని ఆమె అన్నారు.






