ఆస్తి వివాదంలో అల్లుడు చేతిలో అత్త దారుణ హత్య
08-08-2026 10:10 PM
మిస్సింగ్‌పై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
అల్లుడిని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం
తుమ్మూరు,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో ఆస్తి వివాదంలో అత్తను అల్లుడు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం వెదుళ్ల వెంకట నరసమ్మ మిస్సింగ్ అయినట్లు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనుమానం వచ్చిన పోలీసులు అల్లుడు గుండాల తిరుపతిరావును తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఇంకా మృతదేహం ఎక్కడుందో గుర్తించలేదు.






