4 August, 2026 | 3:11 AM

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

04-08-2026 01:55 AM

నిర్మల్ ఆగస్టు 3 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయమే పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎస్పీ కేసు రికార్డులను పరిశీలించారు. శాంతి పద్ధతుల పర్యవేక్షణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పట్టణంలో పోలీస్ శాఖ కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య ఎస్త్స్రలు ఉన్నారు.