4 August, 2026 | 3:10 AM

ఫాంపాండ్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

04-08-2026 01:57 AM

హాజీపూర్, ఆగస్టు 3 : హాజీపూర్ మండలం కర్ణమామిడిలో బొడ్డు భూమన్నకు చెందిన వ్యవసాయ భూమిలో ఫాం పాండ్ కోసం మంచిర్యాల ఎం ఎల్ ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమ వారం భూమి పూజను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి చేశారు. అనంతరం కే జీ బీ వీ పాఠశాల ప్రాంగణంలో ఇంకుడు గుంత కోసం భూమి పూజ చేశారు. ప్రపంచ వన మహోత్సవo సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన విత్తన మేళాలో పాల్గొని విత్తనాలను పరిశీలించి, వ్యవసాయ అధికారులను విత్తనాల కాల పరిమితిని, దిగుబడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కర్ణమామిడి సర్పంచ్ బొడ్డు భూమన్న, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బాణేష్, ఆత్మ చైర్మన్ సింగతి మురళి, జిల్లా వ్యవసాయ అధికారిని సురేఖ, డి ఆర్ డి ఓ కిషన్, మంచిర్యాల ఏ డీ ఏ మామిడి క్రిష్ణ, హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ, లక్టేటిపేట్ వ్యవసాయ అధికారి శ్రీకాంత్, హాజీపూర్ ఎంపీడీవో సాయి కృష్ణారెడ్డి, ఎఫ్ పీ ఓ డైరెక్టర్ బొడ్డు శంకర్, ఏ ఎం సి డైరెక్టర్లు, ఆత్మ డైరెక్టర్లు, పీ ఏ సి ఎస్ డైరెక్టర్లు, హాజీపూర్ మండల సర్పంచులు, ఉప సర్పంచ్లు, కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.