30 June, 2026 | 11:23 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దివీస్ లాబ్స్ లాభం 67 శాతం అప్

26-05-2024 12:05 AM

రూ.321 కోట్ల నుంచి రూ.538 కోట్లకు

ముంబై, మే 25: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ లాబొరెటరీస్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 67.6 శాతం వృద్ధిచెంది రూ.538 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.321 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం సైతం 18 శాతం వృద్ధితో రూ. 1,951 కోట్ల నుంచి రూ. 2,303 కోట్లకు పెరిగింది. శనివారం సమావేశమైన దివీస్ లాబ్స్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.30 చొప్పున డివిడెండు ప్రకటించింది.