డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్
మఠంపల్లి(విజయక్రాంతి) మండల పరిధిలో శుభకార్యాలకు డీజే సిస్టమ్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు మఠంపల్లి ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.సోమవారం మండలంలోని డీజే నిర్వాహకులతో పోలీస్ స్టేషన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసే మాట్లాడుతూ గ్రామాల్లో డీజే శబ్ద కాలుష్యం వల్ల వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీజేలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు శబ్ద కాలుష్యం నియంత్ర నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసి ప్రజల శాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీజే సిస్టంలను,సదరు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా డీజే నిర్వాహకులను మండల తహాసిల్దార్ ఎదుట ఒక సంవత్సరం కాల వ్యవధి అలాగే రూ.5 లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేస్తామని తెలిపారు. గతంలో బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ డీజే లను నడుపుతూ రోడ్లపై న్యూసెన్స్ చేస్తే తహాసిల్దార్ ముందు బైండోవర్ చేసి జైలుకు పంపుతామని తెలిపారు.వీటిపై 24 గంటలు ప్రత్యేకంగా నిఘా ఉంటుందని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి డీజే లు ఏర్పాటు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.






