బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘమైన భారతీయ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పప్పుల సురేష్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పప్పుల సురేష్ మెడికల్ ,సేల్స్ రిప్రజెంటేటివ్ లు, ఫార్మా రంగ ఉద్యోగులు నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, కార్మిక చట్టాల అమలులో లోపాలు వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఉద్యమాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిదంగా ప్రధాన కార్యదర్శి గా సిహెచ్ . రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గా వి. డిజగదీష్, జాయింట్ సెక్రటరీ గా మహేష్, కోశాధికారి గా క్యాతం శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.ఈ నియామకానికి సహకరించిన బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులకు వారంతా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.






