calender_icon.png 6 December, 2024 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోం

07-10-2024 01:06:25 AM

 బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఫేక్ పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఫేక్ ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

మాజీ ఎమ్మెల్యే జీవ న్‌రెడ్డి నిజామాబాద్ కమిషనర్‌కు, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఆశీష్‌కుమార్ యాదవ్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా, సిరిసిల్లలో పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐకి పలు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసత్య ప్రచారాలు మానకుంటే తగిన గుణపాఠం చెబుతామన్నారు.