21 June, 2026 | 1:19 AM

యోగాతో భారత్‌కు గుర్తింపు

21-06-2026 12:00 AM
  1. ఆసనాలతో మానసిక ఒత్తిడి దూరం
  2. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
  3. యోగాతో ఆరోగ్యకరమైన జీవనం
  4. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  5. మతానికి అతీతం.. యోగా సనాతనం
  6. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  7. సంపూర్ణ ఆరోగ్య సాధనం యోగా
  8. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  9. పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా కౌంట్‌డౌన్

సికింద్రాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): యోగాతో భారతీయ సంస్కృతికి ప్రపంచ గుర్తింపు లభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. యో గాతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరే డ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా కౌం ట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, సినీ నటులు పాయల్ రాధకృష్ణ, డింపుల్ హయతి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. యోగాను ప్రతి ఒక్కరు సాధన చేయాలని, తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. యోగా కౌంట్‌డౌన్ పేరుతో హైదరాబాద్‌లో గత ఏడు సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. యోగా యోగా అనేది కేవలం వ్యాయామం కాదు వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవన విధానం అన్నారు.

మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మా ర్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సం ప్రదాయానికి గౌరవం అన్నారు. ‘శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక మహోన్నత సాధనం. భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని నేడు ప్రపంచమంతా స్వీకరించడం మనకు గర్వకారణం’ అన్నారు. మన సం స్కృతి, వారసత్వం, విలువలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తిద్దాం అన్ని గవర్నర్ తెలిపారు. 

యోగాతో విద్యార్థుల మానసిక ఒత్తిడి దూరం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక ఉన్నతికి యోగా ఒక నిలయం వంటిది యోగా. మని షి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి యోగా సాధన ఎంతో అవసరం. విద్యార్థులకు అత్యంత ఆవశ్యకం నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు తమ ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకుని, ఏకాగ్రతను పెంపొందించు కోవడానికి యోగా ఆసనాలు అత్యంత కీలకమైన సాధనంగా ఉపయోగపడతాయి.

ప్రతి ఒక్క విద్యార్థి యోగాను అలవాటు చేసుకోవాలని బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపు నిచ్చారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైపన సంపద. మన దేశ గొప్పదనాన్ని, ప్రాచీన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించింది.

మానసిక ప్రశాంతతను అంది స్తూ, మనిషిని అంతర్గతంగా దృఢపరిచే శక్తి ఒక్క యోగాకే ఉందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్  మా ట్లాడుతూ.. దేశ యువత సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనాలు అత్యం త అవసరం అన్నారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగ అవసరం అన్నారు. 

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం యోగా

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘యోగాను ఏదో ఒక మతానికి పరిమితం చేసి చూడటం ముూర్ఖత్వమే అవుతుంది. యోగా అనేది ఒక నిర్దిష్ట మతానికి సంబంధించింది కాదు అది సర్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి దోహదపడే అద్భుత సాధనం. మన పూర్వీకులు ఎంతో పరిశోధించి, రంగరించి మానవాళికి అందించిన ఒక పరిపూర్ణ జీవన విధానం ఇది. ప్రపంచానికి భారత్ అందించిన అపురూప కానుక యోగా’ అన్నారు. ‘భారతదేశం విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణం. ప్రపంచానికి మనదేశం అందించిన అత్యంత గొప్ప, అపురూపమైన కానుక ’యోగా’ అన్నారు.