21 June, 2026 | 1:20 AM

ఉపాధి హక్కుకు ఆటంకం

21-06-2026 12:11 AM
  1. వీ బీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
  2. పేదలు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం
  3. ఉపాధి హక్కు, పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలి
  4. కేంద్రానికి మంత్రి సీతక్క.. వేర్వేరుగా మూడు లేఖలు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): వీబీ జీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కుకు ఆటంకం కలిగిస్తోందని, బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను యథాతథంగా కొన సాగించాలని కోరారు.

పేదలు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు వీ బీజీ రామ్ జీ చట్టం విఘాతం కలిగి స్తోందన్నారు. ఉపాధి హక్కు, పంచాయతీల అధికారాలను కేంద్రప్రభుత్వం పునరుద్ధరించాలన్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క మూడు వేర్వేరు లేఖలు రాసి, తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, సూచనలను తెలియజేశారు.

వీబీజీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించి కేంద్రం రూపొందించిన నిబంధనలు అనేక అంశాలు పేదలు, దళితులు, ఆదివాసీ గిరిజనులు, భూమిలేని గ్రామీణ కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ముఖ్యంగా నిధుల కేటాయింపును రాష్ట్ర స్థాయిలో నిర్ణయించడం వల్ల గ్రామ పంచాయతీ స్థాయి లో ఉన్న వాస్తవ ఉపాధి అవసరాలు విస్మరణకు గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ము లుగు, నాగర్‌కర్నూల్ వంటి వెనుకబడిన జిల్లాల్లో అధిక ఉపాధి అవసరాలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించడం వల్ల ఆ ప్రాంతాలకు అన్యాయం జరు గుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో గత ఐదేళ్లలో నమోదైన వాస్తవ పనిదినాల ఆధారంగా నిధుల కేటాయింపుకు 80 శా తం ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక సంఘం ప్రమాణాలకు 20 శాతం మాత్రమే వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపా దించింది.

అలాగే నిధుల పంపిణీ, పనితీరు ప్రమాణాల విషయంలో కేంద్రానికి అపరిమిత అధికారాలు ఇవ్వడం చట్టం ఉద్దేశానికి విరుద్ధమన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరమే నిర్ణయాలు తీసుకోవాలని సూ చించింది. ఇందిరమ్మ ఇండ్ల వంటి రాష్ట్ర గృహ నిర్మాణ పథకాలను వీ బీజీ రామ్ జీ పరిధిలో చేర్చాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారు లకు 90 రోజుల ఉపాధి లభించేదని, కొత్త చట్టంలో ఆ అవకాశం తొలగిపోవడం వల్ల పేద కుటుంబాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా వ్యవసాయానికి అనుసంధానంగా, వ్యక్తిగత భూ అభివృద్ధి పనులు, చిన్న రైతులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉపయోగపడే జీవనోపాధి పనులను కూడా అనుమతించాలని కోరారు.

వరదల వల్ల దెబ్బతిన్న భూ ముల పునరుద్ధరణ, కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి, వెదురు తోటలు, న్యూట్రి గార్డెన్లు, వాతావరణ మార్పులను తట్టుకునే జీవనోపాధి పనులను అనుమతించా ల్సిన అవసరం ఉందని వివరించారు. వీబీజీ రామ్ జీ చట్టంలో ప్రతిపాదించిన 60 రోజు ల తప్పనిసరి ఉపాధి విరామాన్ని కూడా మంత్రి సీతక్క తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆదివాసీ గిరిజన ప్రాంతా లు, నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఉపాధి ప్రధాన జీవనాధారమని, అలాంటి ప్రాంతాల్లో 60 రోజుల పాటు పనులు నిలిపివేయడం గ్రామీణ పేద ల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తెలంగాణలో పంటల వైవి ధ్యీకరణ, ఏడాది పొడవునా సాగును ప్రభు త్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ పనులకు నిరంతరంగా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉం దని వివరించారు. అడవులు, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు వర్షాకాలంలోనే చేపట్టాల్సి ఉంటుందన్నారు.

చిన్నారులు, మహిళలకు సంక్షేమ పథకాలు : మంత్రి సీతక్క

చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బాల్య వివాహలు, చిన్నారులపై వేధింపులు, దాడులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేయాలన్నారు. యూసుఫ్‌గూడలోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థలో మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడీ, మిషన్ శక్తి పథకాల అమలు పురోగతిపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... చిన్నారుల రక్షణ, సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం అత్యంత కీలకమైందన్నారు. చిన్నారులపై వేధింపులు, దాడులు లేదా ఇతర దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు వెంటనే స్పందించాలని, ఘటన జరిగిన వెంటనే పైస్థాయి అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

మహిళల భద్రత, రక్షణ, సాధికారత కోసం అమలు చేస్తున్న మిషన్ శక్తి కార్యక్రమాన్ని కూడా అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సీతక్క ప్రశంసించారు. ఈ జిల్లాను ఆదర్శంగా తీసుకుని తెలంగాణను ‘జీరో చైల్డ్ మ్యారేజెస్’ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.