చదువుకునే వయస్సులో వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు
యస్‌ఐ బి.లచ్చిరెడ్డి
మోతె, జూలై 16: చదువుకునే వయస్సులో వ్యసనాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని యస్‌ఐ బి.లచ్చిరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చదువుకునే వయస్సులో చదువుపై శ్రద్ద పెట్టాలని మాదాక ద్రవ్యాల బారిన పడవద్దని డ్రగ్స్ గంజాయితో మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని పూర్తిగా ఆరోగ్యం చెడిపోయి కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయని చెప్పారు.
గ్రామాలలో గాని పాఠశాల పరిసరాల చుట్టు అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల పై వెంటనే 100 కు గాని పోలీసు సిబ్బంది గాని సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యం డి జానీ మియా, ప్రధానోపాధ్యాయులు డి. రాములు, సైదులు, నర్సయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






