దళారులను నమ్మి మోసపోవద్దు
- ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల్లోగా నిర్మాణం పూర్తి చేయాలి
- పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- భూపాలపల్లి జిల్లా కాటారంలో రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత
- మహాదేవపూర్‌లో మొదటి విడత ఇళ్ల ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూన్ 1 (విజయక్రాంతి): నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కాటా రం, మల్హర్, మహాదేవపూర్, మహా ముత్తా రం మండలాలకు చెందిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని చెప్పా రు. రైతులకు వ్యవసాయ అవసరాలకు సరిపడ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఒక సంవత్సరంలో 20 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించామని తెలిపారు.
మహిళలను బస్సులకు అధిప తులు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అనం తరం మహాదేవపూర్ మండల కేంద్రంలో మొదటి విడతలో నిర్మాణాలు జరిపిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కాటారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంత్రి మొక్క లు నాటి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మూడు విడతలుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బు జమవు తుందని, పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల విచారణ, ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఆర్డీవో రవీందర్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామి పధకం రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.






