విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
గుంతలు తవ్వి వదిలేసిన అధికారులు, కాంట్రాక్టర్
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
మేడిపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ మల్లకార్జున నగర్లో 11 కె.వి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు స్థానికులకు ఇబ్బందికరంగా మారాయి. విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం రోడ్లపై తవ్విన గుంతలను పూడ్చకుండా కేబుల్ పనులను మున్సిపల్ శాఖ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, ఎస్బి అధికారుల సమన్వయ లోపంతో అధికారులు, కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఇరుకైన వీధుల్లో ఇళ్ల ముందే పెద్ద గుంతలు ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా తవ్విన మట్టిని, రోడ్డు శిథిలాలను అక్కడే వదిలేయడంతో దుమ్ము, ధూళి సమస్యలు కూడా పెరిగాయని ప్రజలు చెబుతు న్నారు. ఒకవైపు వాటర్ లైన్ పక్కనే 11 కె.వి కేబుల్ వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా మరోవైపు పనులు అసంపూ ర్తిగా వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి గుంతలను పూడ్చి, రోడ్లను య థాస్థితికి తీసుకురావాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేప ట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.






