29 April, 2026 | 3:24 AM

పేదింటి చదువులు పట్టవా?

29-04-2026 01:33 AM
  1. హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు
  2. యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నయి
  3. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు
  4. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పేదింటి విద్యార్థులంతా ఫీజురీ యింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై ఆధారపడి చదువుకుంటున్నారని, వాటిని పెం డింగ్‌లో పెడితే వారెలా చదువుకుంటారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ రాష్ట్రప్రభు త్వాన్ని నిలదీశారు. తక్షణం బకాయిలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బకాయిల డిమాండ్‌తో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఉదయం నాయకులు, విద్యార్థులు హిమాయత్‌నగర్ నుంచి పాదయాత్రగా బయల్దేరారు. పోలీసులు పాదయాత్రను అడ్డుకోగా, ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా మణికంఠరెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ..విద్యార్థితల అప్రజాస్వామికమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడితే, ప్రభుత్వం స్పందించాల్సింది పోయి అరెస్టులతో అడ్డుకోవడం బాధాకరమని వాపోయారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నా రని వివరించారు.

యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతున్నాయని వెల్లడించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యం లో కళాశాల యాజమాన్యాలు ఫీజులు కడితేనే పరీక్ష ఫీజులు తీసుకుంటామని, ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెబుతున్నాయని తెలిపారు. నాడు ఇంటికి వస్తే అందరినీ కలుస్తున్నానని మాట్లాడిన రేవంత్‌రెడ్డి, సీఎం అయిన తర్వాత పట్టించకోవ డం లేదని మండిపడ్డారు.

బకాయలు విడుదల చేసే వరకు ఉద్యమం ఆగదని, అవసర మైతే మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో ఏఐ ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బానోతు రఘు రాం, గ్యార నరేష్, బాలసాని లెనిన్, రాజు, సొతుకు ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చైతన్య యాదవ్, ఎండీ అన్వర్, రామగల్ల నరేష్, వి.ఆంజనేయులు, శాంతికుమార్, కైలాష్, దత్తురెడ్డి, సాయి పాల్గొన్నారు.