29 April, 2026 | 3:22 AM

రాష్ట్రం అగ్నిగుండం

29-04-2026 01:35 AM
  1. నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 46 డిగ్రీలు
  2. ఎనిమిది జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు
  3. ఐదు రోజులు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్రం దంచికొడుతున్న ఎండ లతో అగ్నిగుండంగా మారుతున్నది. ఉద యం నుంచే ఎండ సుర్రుమంటుడటం తో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యం గా చిన్నారులు, వృద్ధులు ఇండ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో ఎవరూ బయటకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఎనిమిది జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

నిజాబాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సత్నాలలో 45.6, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.5, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్‌లో 45.2, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 45.1, ఆసిఫాబాద్‌లో 45.1, నల్లగొండ జిల్లా అడవిదేవుల పల్లిలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. బుధ వారం పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని, రానున్న ఐదు రోజులపాటు ఓ మో స్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.