calender_icon.png 19 January, 2026 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు ఆసుపత్రిలో డాక్టర్ ప్రసవం

15-10-2024 12:13:51 AM

కొత్తకోట, అక్టోబర్ 14: ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ ప్రసవించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వనపర్తి జిల్లా కమాలోద్దీన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ సౌజన్యలత సోమవారం అదే అసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్రమోహన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సౌజన్యలతను అభినందించారు.

పీహెచ్‌సీలో బిడ్డకు జన్మనిచ్చిన సౌజన్యలత రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరుగుతాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు.