14 March, 2026 | 4:25 AM

దివాలా కంపెనీ కేఎల్‌ఎస్‌ఆర్ అక్రమాలపై దర్యాప్తు జరపాలి

14-03-2026 01:43 AM
  1. తన బినామీ కంపెనీని కాపాడుకోవడానికే రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగం

కీలకమైన సాక్ష్యాధారాలు పోయాయని చెప్పడం అత్యంత దురదృష్టకరం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లేఖ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : దివాలా తీసిన బినామీ కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని, తన బినామీని కంపెనీ అయిన కేఎల్‌ఎస్ ఆర్‌ను కాపాడుకోవడం కోసం సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటె డ్‌కు అక్రమంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్న వ్యవహారంపై, కేఎస్‌ఎస్‌ఆర్ కేసు విషయంలో సాక్ష్యాధారాలను రేవంత్‌రెడ్డి మాయం చేయించడంపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో తీవ్రంగా దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.

కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఆదేశాల మేరకు సాక్ష్యా ధారాలను తారుమారు చేసిందని కేటీఆర్ తన లేఖలో ఆరోపించారు. విచారణలో భాగంగా సేకరించిన కీలకమైన సాక్ష్యాధా రాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు, దర్యాప్తు విభాగాల పైన ఉన్న ఒత్తిళ్లకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీకి లాభం చేకూ ర్చేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని ఆరోపించారు.  విచారణ సంస్థలు, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు.

కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీ ఇప్పటికే దివాళా ప్రక్రియలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆ సంస్థకు భారీగా కాంట్రాక్టులు కేటాయి స్తున్నారని విమర్శించారు. అమిత్ షాకు పంపి న ఈ లేఖ ప్రతులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు కూడా పంపినట్లు కేటీఆర్ తెలిపారు.

రూ. 2,500 కోట్ల కాంట్రాక్టులు..

ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న ఈ కంపెనీకి సుమారు రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించబడినట్లు నివేదికలు చెబుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు, ప్రధాన రహదారి నిర్మాణ పనులు వంటి అనేక కీలక ప్రభుత్వ ప్రాజెక్టులను ఈ కంపెనీకి అప్పగించడం ప్రభుత్వ కొనుగోలు విధానాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నదని స్పష్టం చేశారు.

కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయమని, గతంలో జరిగిన ఆదాయపు పన్ను విచారణలో సీఎం దీర్ఘకాలంగా ఉపయోగించిన టొయోటా ల్యాండ్ క్రూజర్ (టీఎస్ 07 ఎఫ్‌ఎఫ్ 0009) వాహనం ఆ కంపెనీ పేరిట నమోదై ఉన్నట్లు బయటపడిందని గుర్తుచేశారు. ఈ కంపెనీకి సంబంధించిన దివాలా వ్యవహారం నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉండగా,

విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాల నేపథ్యంలో 2025 ఆగస్టు 13న ట్రిబ్యునల్ సభ్యు డు జస్టిస్ శరద్‌కుమార్ ఈ కేసు విచారణ నుం చి తప్పుకున్నట్లు నివేదికలు వెల్లడించాయని తెలిపారు. అలాగే, 2022లో కేఎల్‌ఎస్‌ఆర్ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించిన ఏఎ స్ మెట్ క్రాప్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా 75 సంవత్సరాల వయసున్న క్యాన్సర్ రోగిని అరెస్టు చేయడం మానవతా కోణంలో తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపారు. 

ఆల్ ది బెస్ట్ : కేటీఆర్

నేటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థిని విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి, విజయం సాధిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. 

దర్యాప్తు జరిపించాలి..

తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న రిట్ పిటిషన్ నెం. 18267/2025 సం దర్భంగా కీలకమైన సాక్ష్యాధారాలుగా స్వాధీ నం చేసుకున్న పత్రాలు అధికారిక కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన విషయం బయటపడిందని కేటీఆర్ తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమా దం కూడా సాక్ష్యాధారాల భద్రతపై అనుమానాలను మరింత పెంచిందని వెల్లడించారు.

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకు ని, కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీపై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అక్రమాలు, మనీలాండరింగ్ అనుమానాలపై పక్షపాతం లేకుండా పూర్తిస్థాయి విచారణ జరగాలని కేటీఆర్ కేంద్ర ప్ర భుత్వాన్ని కోరారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇ న్వెస్టిగేషన్ (సీబీఊ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆ ఫీస్ వంటి కేంద్ర దర్యాప్తు సం స్థలతో సం పూర్ణ దర్యాప్తు జరిపించాలని తన లేఖలో అ భ్యర్థించారు. ప్రభుత్వ నిధులను కాపాడడం, పాలనలో పారదర్శకత, చట్టబద్ధమైన వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని కాపా డేందుకు ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరగడం అత్యవసరమని కేటీఆర్ పేర్కొన్నారు.