16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

చిన్న రామన్ చెర్లలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణ

17-11-2025 12:09 AM
  1. పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

బచ్చన్నపేట నవంబర్ 16 విజయక్రాంతి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామంచర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని కురుమ సంఘం జిల్లా రాష్ట్ర నేతలు ఎగ్గే మల్లేశం, క్యామ మల్లేశం లతో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం కేమిడి కనకరాజు అధ్యక్షతన వహించగా. జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండెను ఎదురుగా పెట్టి పోరాడిన మహా యోధులు దొడ్డి కొమురయ్య అని అన్నారు. భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో ముందుండి పోరాటాలు చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.