కృష్ణయ్య వైసీపీని వీడనున్నారా ?
30-08-2024 03:34 PM
హైదరాబాద్: వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరిన మోపీదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు బాటలోనే ఆర్ కృష్ణయ్య కూడా వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు జోర్ందుకున్నాయి. తెలంగాణ కు చెందిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సైతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని.. వాళ్ల లాగ తాను పార్టీ మారబోవడం లేదన్నారు. బీసీల కోసం కొట్లాడమనే జగన్ తనను రాజ్యసభకు పంపించారన్నారు. తాను టీడీపీ లో చేరే అవకాశమే లేదన్నారు. చివరి వరకు వైసీపీలోనే ఉంటానన్నారు. బీసీ సంఘమే తనకు పార్టీ అని చెప్పారు.






