ఆలియాతో యాక్షన్ థ్రిల్లింగ్ అనిపించింది
యశ్‌రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చో ప్రా నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఆ ల్ఫా’. శివ్ రవాలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తోపాటు మరో హీరోయిన్ శర్వారి ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ స్టార్ అనీల్ కపూర్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.
జూలై 10న విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను బాబీ డియోల్ పంచుకున్నారు. “రణ్‌బీర్‌తో ‘యానిమల్’లో చేశా. ఆలియాతో ఈ సినిమాలో చేస్తున్నా. ఇది నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చింది. వ్యక్తులను చంపటానికి శిక్షణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంతకురాలి కథతో ‘ఆల్ఫా’ తెరకెక్కుతోంది. ఇండియన్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు యాక్షన్ సన్నివేశాల్లో నటించటం చాలా గొప్ప విషయం. ఆలియా యాక్షన్.. ఆమె సన్నద్ధమైన తీరు నన్నెంతో ఆకట్టుకుంది” అని తెలిపారు బాబీ డియోల్.






