విశ్వనాథ్ అండ్ సన్స్ సందడి పంద్రాగస్టుకే
29-05-2026 02:32 AM
స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ఇందులో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుం బ అనుబంధాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా వచ్చే పంద్రాగస్టుకు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.






