మహేష్‌బాబుతో డాలర్ బిగ్‌బాస్

17-09-2026 | 05:25am
  1. కొనసాగనున్న ప్రయాణం
  2. త్వరలో సరికొత్త టీవీ ప్రకటన చిత్రీకరణ ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): దేశీయ హోసియరీ రంగం(Domestic hosiery sector)లో అగ్రగామి ‘డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Dollar Industries Limited)’ దక్షిణాది మార్కెట్‌కు ‘డాలర్ బిగ్‌బాస్(Dollar Bigg Boss)’ బ్రాండ్ అంబాసీడర్‌(Brand Ambassador)గా ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ మహేష్‌బాబు(Mahesh Babu)తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించింది. ఈ సందర్భంగా డాలర్ ఇం డస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ దక్షిణాది మా ర్కెట్‌లోకి డాలర్ ఉత్పత్తులను 2024లో ప్రవేశపెట్టామని, మా ఉత్పత్తులకు విశేష ఆ దరణ లభించిందని తెలిపారు.

డాలర్ బిగ్‌బాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఏర్పడిన అనుబంధం మా బ్రాండ్‌కు ఎంతో ఉపయోగపడిందన్నారు. అందుకే ఆయనతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే ఆయనతో కూడిన సరికొత్త వాణిజ్య ప్రకటనను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలి పారు. దక్షిణాది మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ సరికొత్త టెలివిజన్ ప్రకటనలో మహేష్‌బాబు డైనమిక్ లుక్‌తో కని పించనున్నారన్నారు.

అన్ని వేళలా, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ‘ధృడత్వం, నమ్మ కం, స్టుల్’ అందించే బ్రాండ్ తత్వాన్ని ఈ ప్రకటన ప్రతిబింబించనుందని పేర్కొన్నారు. కాగా ‘డాలర్’ ఒక సాధారణ హోసియరీ బ్రాండ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. నేడు ఇన్నర్‌వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగింది. భారతదేశంలో ప్రముఖ హోసియరీ, దుస్తుల తయారీ దిగ్గజాలలో ఒకటిగా నిలిచింది. ప్రాథమిక లోదుస్తుల నుంచి ఔటర్ వేర్ వరకు అన్ని రకాల దుస్తులను అందిస్తుంది.

నాణ్యత, సరసమైన ధరలకు మారు పేరుగా నిలిచిన ‘డాలర్’ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. అందర్జాతీయ మార్కెట్ లో తనదైన ముద్ర వేసింది. ఆర్గనైజ్డ్ ఇన్నర్‌వేర్ మార్కెట్‌లో దాదాపు 15 శాతం వాటా ను కలిగి ఉన్న డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రాన్ని కలిగిన మొదటి ఇన్నర్‌వేర్ సం స్థగా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు