11 August, 2026 | 1:45 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయి: ట్రంప్

22-06-2025 08:58 AM

వాషింగ్టన్: ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడిని ప్రశంసిస్తూ ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ అభినందించారు. ఇరాన్ పై దాడిని చారిత్రక క్షణంగా అభివర్ణించారు. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం అని ట్రంప్(Trump) ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కీలక మైన ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ తెలిపారు.

గతరాత్రి చేసిన దాడులు చాలా కష్టతరమైనవి.. ప్రాణాంతకమైనవన్నారు. ఇరాన్ అణు సామర్ధ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని ట్రంప్ తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యమన్నారు. మధ్య ప్రాచ్చ దేశాలను ఇరాన్ భయపెడుతోందని ట్రంప్ సూచించారు. పశ్చిమాసియాలో శాంతి, ఇరాన్ లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని చెప్పారు. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాని ట్రంప్ హెచ్చరించారు. త్వరగా శాంతి నెల్పకపోతే మిగిలిన లక్ష్యాలపై దాడులు చేస్తామని తెలిపారు. వేగం, నైపుణ్యంతో మిగిలిన లక్ష్యాలను నిమిషాల్లో ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్ జనరల్ చేతిలో అనే మంది హతమయ్యారని పేర్కొన్నారు. మా ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదు.. జరగనివ్వను అని ట్రంప్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ బృందంగా పనిచేశాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.