7 March, 2026 | 12:38 PM

ఇరాన్‌ సైన్యం పనైపోయింది: ట్రంప్

07-03-2026 10:57 AM

వాషింగ్టన్: ఇరాన్‌లో అమెరికా సైనిక దాడులను(Military Attacks) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రశంసించారు.  సైన్యం, నేవీ, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇరాన్ కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్  పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం పనైపోయింది.. వారి నాయకులు కూడి చనిపోయారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ వైమానిక దళాలు(Iranian Air Forces) పూర్తిగా తడిచిపెట్టకుపోయాయని వివరించారు.

ఇరాన్ వద్ద ఉన్న 32 షిప్ లు సముద్రపు అడుగుభాగంలో ఉన్నాయన్న ట్రంప్ అమెరికాను ఇంతకుముందు కంటే ఎక్కువగా గౌరవిస్తున్నారని చెప్పారు. టెహ్రాన్ లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై(Mehrabad International Airport) భారీ వైమానిక దాడులు జరుగుతున్నాయి. వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ స్థానిక మీడియా ప్రకటించింది. ఇరాన్ లోని 3 వేలకుపైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ పోరాట శక్తి క్రమంగా క్షీణిస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. లెబనాన్ లో హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థపై(Hezbollah militant organization) ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేస్తోంది.