3 August, 2026 | 2:00 AM

గ్రంథాలయానికి రూ.7,000 విలువైన పోటీ పరీక్షల పుస్తకాల విరాళం

03-08-2026 12:57 AM

కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు  కల్పనా చౌదరి

చుంచుపల్లి,ఆగస్టు 2 (విజయక్రాంతి ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మేయర్  బోడ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పనా చౌదరి ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్  రూప్లా నాయక్  జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.7,000 విలువైన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రంథాలయ అభివృద్ధికి చైర్మన్ పసుపులేటి వీరబాబు  చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే నిరుపేద కుటుంబాలకు సేవలందిస్తూ, విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కొల్లి ఫౌండేషన్ సేవలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్2 గ్రంథపాలకురాలు సూరేపల్లి లలిత కుమారి, గ్రంథాలయ సిబ్బంది జి. మణి, మృదుల, విద్యార్థినీవిద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.