19-02-2026 12:06:30 AM
చేవెళ్ళ, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ పెద్దొల దయాకర్ రాముని గుడికి రూ. 5లక్షలు విరాళం ఇచ్చారు. అనంతరం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ వార్డు కౌసిలర్ గా గెలిచిన ఆనందంతో ఆలయ అభివృద్ధి విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని వారన్నారు.
ఆలయ వాతావరణం మనిషికి మనషిక ప్రశాంతత చేకూర్చుతుందన్నారు. బడి విజ్ఞానాన్ని ఇస్తే గుడి ప్రశాంతతను ఇస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ లేని చరిత్రత్మాకమైన కట్టడాలకున్న వైవిద్యం భారత దేశంలో ఆలయాలకు ఉండడమే ఇందుకు నిదర్శనం అన్నారు. రామప్ప దేవాలయాన్ని యునేస్కో గుర్తింపు నివ్వడం గొర్వకారణమన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయ నిర్మానాలకు విరాళం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.