రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి విరాళం
రూ.3.50 లక్షల బంగారు గొలుసు కానుక
వేములవాడ, ఆగస్టు 3 (విజయ క్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వేములవాడ పట్టణానికి చెందిన బాయి సురేఖ, విద్యాసాగర్ దంపతులు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్ల తో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేశారు. సోమవారం స్వా మివారికి ఈ బంగారు గొలుసును సమర్పించారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి విరాళా న్ని స్వీకరించి అధికారిక రసీదును అందజేశారు.
భక్తులు అందించే బంగారం, వెండి, నగదు విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధా ర్మిక కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నట్లు ఆమె తెలిపారు. భా యి విద్యాసాగర్ సురేఖ దంపతుల సేవాభావాన్ని అభినందిస్తూ, స్వామివారి అనుగ్ర హం వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






