4 August, 2026 | 3:01 AM

ఎన్‌రోల్‌మెంటులో ప్రథమ స్థానంలో తాడ్వాయి

04-08-2026 12:56 AM

తాడ్వాయి, ఆగష్టు 3 (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్ లో జిల్లాలోనే తాడ్వాయి ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంఈఓ రామస్వామి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో సోమవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ... ఎర్ర పహాడ్ కాంప్లెక్స్ పరిధిలో ఎన్రోల్మెంట్ పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వెంటవెంటనే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి, మాధురి, ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.