23 April, 2026 | 9:16 PM

గాయం తడవకుండా!

02-03-2025 12:00 AM

ఫ్రాక్చర్ అయినప్పుడూ, గాయాలైనప్పుడూ.. కాళ్లకూ, చేతులకూ కట్టు కడుతుంటారు. స్నానం చేసేటప్పుడు ఆ కట్టు తడవకుండా చూసుకోవడం పెద్ద సమస్యే. ఎంత జాగ్రత్తపడ్డా కట్టుపైన నీళ్లు పడుతుంటాయి. ఆ బాధ లేకుండా చేస్తుందీ వాటర్‌ప్రూఫ్ లెక్ కాస్ట్ ప్రొటెక్టర్. చూడటానికి పాలిథిన్ కవర్లలా ఉండే వీటిని కాలూ లేదా చేతికి తేలిగ్గా తొడుక్కోవచ్చు. ఈ కవర్‌కుండే సిలికాన్ పొర చర్మాన్ని గట్టిగా పట్టుకుని, నీళ్లు కట్టు వరకూ వెళ్లకుండా చూస్తుంది. స్నానం చేసినా ఏ ఇబ్బందీ ఉండదు.