24 August, 2026 | 10:40 PM

Breaking News

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •  

యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడుచేసుకొవద్దు

27-06-2025 01:48 AM

 మంథని లో 2కే రన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు

మంథని, జూన్ 26(విజయ క్రాంతి); యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడుచేసుకొవద్దని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.మంథని పట్టణంలో గురువారం యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ను జెండా ఊపి పెద్దపల్లి డిసిపి కరుణాకర్,  గోదావరిఖని ఏసిపి రమేష్ ప్రారంభించారు.

అనంతరం మంథని లోని పాత పెట్రోల్ బంక్ నుండి బస్ డిపో మీదుగా గాంధీ చౌక్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ లో పాఠశాల విద్యార్థులు, యువకులు, రాజకీయ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.ఈసందర్భంగా వారితో కలిసి శ్రీను బాబు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై చాలా మంది అనారోగ్యం పాలై కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయరన్నారు.

మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించిన, మత్తు పదార్థాలు కలిగిఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలిపి సమాజాన్ని కాపాడాలని కోరారు.ఈసందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరి చేత పోలీసులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు డేగ రమేష్, తాడవేన శ్రీనివాస్, నరేష్, ఏ ఎస్‌ఐ లు, హెడ్ కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, యువకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.