24 August, 2026 | 11:43 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

హెలెన్ కిల్లర్స్ 145వ జయంతి

27-06-2025 01:47 AM

నేడు హెలెన్ కిల్లర్స్ స్కూల్‌లో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): జూన్ 27న ప్రపంచ ప్రఖ్యా తి గడించిన హెలెన్ కిల్లర్స్ 145వ జయంతి సందర్భంగా శుక్రవారం బ్యాంక్ కాలనీలోని హెలెన్ కిల్లర్స్ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరుపుకుంటున్నారని విద్యాసంస్థల చైర్మన్ పఠాన్ ఉమర్‌ఖాన్ తెలిపారు. అనంతరం శ్రీ కాలనీలోని హెలెన్ కిల్లర్స్ స్పీచ్ అండ్ హియ రింగ్ క్లినిక్ నందు ఫ్రీ హియరింగ్ చెకప్ క్యాంపును ప్రారంభిస్తామన్నారు.

ఈ క్యాం పు జూలై 4వ తేదీ వరకు ఉంటుందని, వినికిడి లోపము, నత్తి, సరిగ్గా మాట్లాడలేని స్థితి, చెప్పింది అర్థం కానిస్థితి, చదువులో వెనుకబడుట, మొండితనం, బుద్ధి మద్యత, ఆర్టి జం లాంటి సమస్యలు ఉన్నవారు తమ నిపుణులను సంప్రదించవచ్చని చెప్పారు. బాగ్ లిం గంపల్లిలో గల సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో ది వ్యాంగ విద్యార్థులకు ప్రతిభ అవా ర్డులను అందజేస్తామని చెప్పారు.

హెలెన్ కలర్స్ ఫౌండర్ సెక్రటరీ రమీజాభి జ్ఞాపకా ర్థం వారి పేరున మెరిట్ అవార్డు అందజేస్తామన్నారు. విశ్రాంత మెట్రో పొలిటిన్ క్రిమినల్ కోర్ట్ జడ్జి జస్టిస్ నవాజ్ ఖాన్, చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి గుమ్మడి వెన్నెల, ఎన్ పి ఆర్ డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్, టీఏఎస్‌ఎల్‌పీఏ అధ్యక్షుడు కె నాగేందర్, ప్రధాన కార్యదర్శి  ఇమాద్ ఖాన్ రూమన్ హాజరవుతారని చెప్పారు.