4 August, 2026 | 1:53 AM

డాక్టర్స్ కాలనీలో ఇంటింటికీ ఎస్‌ఐఆర్

04-08-2026 12:00 AM

డివిజన్ అధ్యక్షుడు ధన్‌రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన

నాగోల్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని డాక్టర్స్ కాలనీ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ఓటర్ సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు మరియు ఇతర వివరాలను పరిశీలించాలని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నల్లెంకి ధన్రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.