20 March, 2026 | 10:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

డబుల్ ధమాకా..

10-07-2024 12:28 AM

 బుమ్రా, మంధనలకు ఐసీసీ అవార్డులు

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డుల్లో  భారత ఆటగాళ్లు డబుల్ దమాకా మోగించారు. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ నెలకు గానూ ఈ ఇద్దరు అవార్డు గెలుచుకున్నట్లు సోమవారం ఐసీసీ వెల్లడించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో పేసర్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు.

8 మ్యాచ్‌ల్లో బుమ్రా 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించిన స్మృతి మంధన తొలిసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేలో సెంచరీలతో కదం తొక్కిన మంధన మూడో వన్డేలోనూ సెంచరీకి చేరువగా వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఏకైక టెస్టులోనూ మంధన (149 పరుగులు) శతకంతో మెరిసింది.