12 August, 2026 | 4:14 PM

ఆగస్టు 14 నుంచి భూపాలపల్లిలో మహనీయుల నాటకోత్సవాలు

12-08-2026 02:59 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆగస్టు 14 నుంచి 16 వరకు భూపాలపల్లి ఏరియాలో మహనీయుల జీవిత చరిత్ర నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఆగస్టు 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, 15న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, 16న గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర నాటకాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు.

కార్మికులు, కుటుంబ సభ్యులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాటకోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం వైస్‌ ప్రెసిడెంట్ చక్రపాణి, వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.వి.రావు, బ్రాంచ్ కార్యదర్శి మండల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రాజమల్లు, ఆర్గనైజర్ కోచర్ల రవి, పిట్ సెక్రటరీలు గౌతమ్, కుమ్మరి శ్రీనివాస్, భద్రయ్య, మాతంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.