12 August, 2026 | 4:14 PM

ఎరువుల యాప్‌పై అవగాహన

12-08-2026 03:02 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాజీవాడి గ్రామంలో బుధవారం ఎరువుల యాప్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్బంగా రైతులకు ఎరువుల బుకింగ్ విధానం, యాప్‌ ద్వారా ఎరువులను సులభంగా బుక్ చేసుకునే విధానం గురించి మండల వ్యవసాయ అధికారి ప్రజాప్రతి వివరంగా అవగాహన కల్పించారు.

అలాగే ఆయిల్‌పామ్ సాగు ప్రాధాన్యత, ప్రయోజనాలు, సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు (సబ్సిడీలు) మరియు ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై వివరించారు. జలసిరి కార్యక్రమం కింద చేపట్టే ఫార్మ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు), వాటి నిర్మాణం, ఉపయోగాలు, రైతులకు కలిగే ప్రయోజనాల గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాజీవాడి గ్రామ సర్పంచ్ భవాని సాయిలు , రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారి M. సురేందర్ పాల్గొన్నారు.