12 August, 2026 | 4:14 PM

ప్రజల మనసులో ముద్ర వేసుకున్న మహానాయకుడు ఎర్ర సత్యమన్న

12-08-2026 02:57 PM

మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్,(విజయక్రాంతి) :  ప్రజల మనసులో  చిరస్థాయిగా బ్రతికిన మహానాయకుడు ఎర్ర సత్యమన్న అని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ నగరంలోని ఎర్ర సత్యం చౌరస్తా వద్ద ఎర్ర సత్యమన్న విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలిసి ఆయన  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఎన్టీఆర్ సారథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్ర సత్యం ప్రజలకు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు.పండుగ సాయన్న నాడు పెద్దలను కొట్టి పేదలకు పంచినట్లు సత్యమన్న కాంపౌండ్ కు పోతే పేదవారికి న్యాయం జరిగేదని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా భావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఎర్ర సత్యం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు. 

ఎర్ర సత్యం గొప్ప ధైర్యశాలి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 ప్రజల అండగా ఉండేందుకు ఎల్లప్పుడూ పరితపించేవారని గొప్ప ధైర్యశాలి అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై నిర్భయంగా పోరాడిన ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎర్ర సత్యం అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్,  మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి, జహీర్ అక్తర్, , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి,  నాయకులు ఎస్టి సెల్ శేఖర్ నాయక్ , డిసిసి ప్రధాన కార్యదర్శులు బుద్దారం సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సాయిబాబా, నాయకులు  ఎన్ పి నేహా, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.