26 April, 2026 | 2:21 AM

మున్సిపల్ కాలనీలో తాగునీటి సమస్యకు చెక్

26-04-2026 12:00 AM

రెండ్రోజుల్లో బోర్లు మరమ్మతు కాలనీవాసులకు ఊరట

నాగోల్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీలో తాగునీటి సమస్యను బిఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే పరిష్కరించారు. బోర్లు చెడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తెలియజే యగా, వెంటనే స్పందించి సొంత నిధులతో మరమ్మతులు చేపట్టించారు.

కేవలం రెండు రోజుల్లోనే బోర్లను సరిచేసి ప్రతి ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీహరి, నాయకులు నరేష్, పురుషోత్తం, పులి కిరణ్, సాయి, వినోద్ కుమార్, శివప్రసాద్, అభిషేక్, ప్రమోద్, అజ్జు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.